79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా దేశం ఘనంగా వేడుకలు జరుపుకుంటోంది. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ ఎర్రకోటపై వరుసగా 12వ సారి జాతీయజెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు.
ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్య్ర దినోత్సవమని ఇది 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని పేర్కొన్నారు. ప్రతి ఇంటిపై మూడు రంగుల జాతీయ జెండా ఎగిరే సమయమన్నారు. సమైక్య భావనతో దేశం ఉప్పొంగే తరుణమని అన్నారు. ఆయన తన ప్రసంగంలో కీలక అంశాలపై మాట్లాడారు.
దేశంలో హైపవర్డ్ డెమోగ్రఫీ మిషిన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో అవకాశాలు చొరబాటుదారులు లాక్కోకుండా చూడటమే దీని లక్ష్యమని ముఖ్యంగా ఆదివాసీల భూములను చొరబాటుదారులు లక్ష్యంగా చేసుకొంటున్నారని ఇకపై వారి ఆటలు సాగనీయబోమని స్పష్టం చేశారు.రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ 100 ఏళ్లుగా దేశానికి సేవ చేస్తోంది. వారి అంకితభావానికి నా సెల్యూట్ చేశారు. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ గార్ యోజన కింద ప్రైవేటు రంగంలో మొదటి ఉద్యోగం తెచ్చుకొన్నవారికి రూ.15,000 అందజేయనున్నట్లు పేర్కొన్నారు. తూర్పు భారత్ లో ప్రదేశాలను దేశంలోని మిగిలిన భాగాలతో సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల అంతరిక్ష యాత్ర చేసిన శుభాంశు శుక్లా దేశానికి గర్వకారణమని గగనయాన్ మిషిన్ కోసం భారత్ వేగంగా సిద్ధం అవుతోందని తెలిపారు . భవిష్యత్తులో స్వయంగా స్పేస్ స్టేషన్ కూడా ఏర్పాటుచేసేందుకు భారత్ ప్రణాళికలు చేస్తోందన్నారు. మన రైతులకు వ్యతిరేకంగా ఉండే ఎలాంటి విధానాలకైనా తాను ఒక గోడలా అడ్డం పడతానని స్పష్టం చేశారు. మన వ్యాపారులు దేశీయ ఉత్పత్తులను బోర్డులపై రాసి ప్రదర్శించాలని పేర్కొన్నారు. దేశ వనరులైన సముద్రంలో సహజవనరులు, గ్యాస్, చమురు అన్వేషణకు వీలుగా నేషనల్ డీప్ వాటర్ ఎక్స్ ప్లోరేషన్ మిషిన్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. భారత రక్షణా సామర్థ్యం గురించి మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ తో సమాధానం చెప్పామని తెలిపారు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు అని పహల్గాంలో మతం పేరుతో దాడి చేసిన ఉగ్రవాదులకు సరైన రీతిలో గుణపాఠం చెప్పామన్నారు. ఆ ఘటనపై యావత్ దేశం అగ్రహంతో రగిలిపోయింది. దానికి సమాధానంగానే ఆపరేషన్ సిందూర్ చేపట్టి శత్రువును ఊహించని రీతిలో చావుదెబ్బకొట్టాం. శత్రుమూకలను ఎప్పుడు ఎలా మట్టుబెట్టాలో సైన్యం నిర్ణయిస్తుంది. లక్ష్యం, సమయం ఎంచుకునే స్వేచ్ఛ త్రివిధ దళాలకే ఇచ్చినట్లు పేర్కొన్నారు.
అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడదనే విషయాన్ని తేల్చి చెప్పాం. నీరు, రక్తం కలిసి ప్రవహించవని మరోసారి పునరుద్ఘాటించారు. పాక్ తో సింధూ జలాల ఒప్పందంపై మరో మాట లేదు. వాటిని భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో మార్పు లేదని అన్నారు . నీటి కొరత ఉన్న ప్రాంతాలకు వాటిని తరలిస్తాం. వాటిపై సంపూర్ణాధికారం భారత్, భారత రైతులది మాత్రమేనని స్పష్టం చేశారు.
ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్యం… ఎర్రకోటపై ప్రధాని మోడీ కీలక ప్రసంగం
By admin2 Mins Read