ఆంధ్రప్రదేశ్ మానవాభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ తో సమావేశమయ్యారు. ఇటీవల ఏపీ ప్రభుత్వ బృందం సింగపూర్ పర్యటన వివరాలు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సింగపూర్ ప్రభుత్వంతో జరిపిన చర్చల గురించి వివరించారు. ఏపీ నుంచి ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్లే యువతకు సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చేందుకు విశాఖపట్నంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, డేటా సిటీ ఏర్పాటుకు కేంద్ర సహకారం అందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. విశాఖలో డేటా సిటీని అభివృద్ధి చేయడం వల్ల భవిష్యత్తులో ఏపీ టెక్నాలజీ హబ్ గా తయారవుతుందని, ఇందుకు సహకారం కావాలని కోరినట్లు లోకేష్ తెలిపారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు