వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పాడిన వాయుగుండం ఈరోజు మధ్యాహ్నం తీరం దాటింది. విశాఖ వాతావరణ కేంద్రం తెలిపిన ప్రకారం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కి సమీపంలో వాయుగుండం తీరం దాటింది. వాయుగుండం ప్రభావంతో గంటకు 35 – 45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, ఉత్తరాంధ్రలో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి వాతావరణం లో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.
Previous Articleఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్ లో భారత్ శుభారంభం
Next Article రష్మిక మంథన నటిస్తున్న ‘థామా’ నుంచి విడుదలైన టీజర్