మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన నూతన ఆవిష్కరణలను చంద్రబాబు తిలకించారు. పేరుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అయినప్పటికీ టాటా గ్రూప్ నాయకత్వంలో ఎల్ & టీ, జె ఎస్ డబ్ల్యూ, అదానీ, గ్రీన్ కో, జిఎంఆర్, కియా వంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ హబ్ లో భాగస్వామ్యం అవుతున్నాయి. అదేవిధంగా అమరావతిలోని ఈ హబ్ కు అనుబంధంగా రాష్ట్రంలో మరో ఐదు విభాగాలు ఏర్పాటు అవుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏళ్లుగా ఐటి అభివృద్ధి కోసం చంద్రబాబు చేస్తున్న కృషిని తాము చూస్తున్నామని అప్పుడూ ఆయనతో కలిసి పని చేసాం, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో కూడా ఆయనతో కలిసి పని చేస్తున్నాం. చంద్రబాబు గారి విజన్‌కి తోడుగా, టాటా గ్రూప్ ఉండటం సంతోషమని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు.
మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు
By admin1 Min Read