రైతులు చెమటోడ్చి పండించిన ధాన్యం విక్రయించుకొనేందుకు ప్రయాస అవసరం లేదని 73373 59375 నెంబర్ కి వాట్సాప్ నుంచి Hi చెబితే చాలు… సేవలు అందుబాటులోకి వస్తాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వీడియోను పోస్ట్ చేశారు. మీరు ఏ కేంద్రంలో, ఏ రోజు, ఏ టైములో, ఏ రకం ధాన్యం, ఎన్ని బస్తాలు అమ్మదలుచుకున్నారో మెసేజ్ ఇస్తే స్లాట్ బుక్ అవుతుందని వివరించారు. సులభంగా రైతులకు అర్థమయ్యే విధంగా వాట్సాప్ సేవలు కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చిందని పేర్కొన్నారు. స్లాట్ బుక్ చేసుకోవడం ఎలాగో ఆ వీడియోలో పొందుపరిచారు.ఇది మంచి ప్రభుత్వం… రైతుల మేలు కోరే ప్రభుత్వం! అని మనోహర్ పేర్కొన్నారు.
ఇది మంచి ప్రభుత్వం… రైతుల మేలు కోరే ప్రభుత్వం!: మంత్రి నాదెండ్ల మనోహర్
By admin1 Min Read