దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అమ్మకాల ఒత్తిడితో నేటి ట్రేడింగ్ ను నష్టాలతో ముగించాయి. ముఖ్యంగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి ఐటీ స్టాక్స్ మార్కెట్ జోరును తగ్గించాయి. దీంతో సెన్సెక్స్ ఓ దశలో 600 పాయింట్లు కోల్పోయింది. అయితే తిరిగి కాస్త కోలుకుంది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ నిఫ్టీ 23,450 వద్ద ముగిసింది. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సెన్సెక్స్ ఉదయం 77,863 లాభాల్లో ప్రారంభమైంది. కాసేపటికే నష్టాల్లోకి జారుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 241.30 పాయింట్ల నష్టంతో 77,339 వద్ద ముగిసింది. నిఫ్టీ 78.90 పాయింట్ల నష్టంతో 23,453 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ 84.40గా ఉంది.
Previous Articleకనకదాస వారి బోధనలు సమాజాన్ని సక్రమ మార్గంలో నడిపించేందుకు ఉపకరిస్తాయి: ఏపీ సీఎం చంద్రబాబు
Next Article టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు