అక్కినేని నాగచైతన్య – సాయి పల్లవి జంటగా ‘తండేల్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్స్ త్వరలోనే ప్రారంభించే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించారు.’బుజ్జి తల్లి’ అనే పాటను నవంబర్ 21న విడుదల చేయనున్నట్లు తెలిపారు.ఈ మేరకు ఓ చైతన్య- సాయిపల్లవి ఫొటోను ఎక్స్ లో షేర్ చేశారు.’తండేల్ రాజు బుల్లితల్లికి ప్రేమతో’ ఈ లవ్ ట్రాక్ 2024లోనే సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు.
A piece of Raju's heart in a song #BujjiThalli from 21st November #Thandel #ThandelonFeb7th pic.twitter.com/6FxaS62mUN
— chaitanya akkineni (@chay_akkineni) November 18, 2024