ఎయిరిండియా ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. థాయ్‌లాండ్ నుంచి దిల్లీ బయలు దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 80 గంటలుగా ఆ దేశంలోనే చిక్కుపోయారు. 100 మందికి పైగా ప్రయాణికులతో నవంబరు 16న థాయ్‌లాండ్ నుంచి ఈ విమానం బయలుదేరింది. టేకాఫ్ అయిన కాసేపటికే దానిలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంటల పాటు ప్రయాణికులు వేచి చూడాల్సి వచ్చింది. అలా 80 గంటలుగా థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో చిక్కుకుపోయారు. దీనిపై ఎయిర్‌లైన్స్ సంబంధిత వర్గాలు స్పందించాయి. ఇప్పటికే కొంతమందిని గమ్యస్ధానానికి చేర్చామని పేర్కొన్నాయి. కేవలం 40 మంది మాత్రమే ప్రస్తుతం ఆ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నారని.. వారి ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు