కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరానికి దిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఎయిర్సెల్ – మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది. ఎయిర్సెల్- మ్యాక్సిస్ కేసులో చిదంబరం ఆయన కుమారుడు కార్తీ చిదంబరంపై ట్రయిల్ కోర్టులో ఈడీ కొంతకాలం క్రితం ఛార్జిషీట్ దాఖలు చేసింది. దీనితో చిదంబరంపై విచారణకు ట్రయల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ చిదంబరం దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా, తాజాగా ఆయనపై విచారణను నిలిపివేయాలని కోర్ట్ ఆదేశించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు