సూపర్‌స్టార్ మహేశ్ బాబు,దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో ఓ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు తెరకెక్కనున్న విషయం తెలిసిందే.త్వరలో పట్టాలెక్కనున్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి నటుడు రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.తన ప్రోగ్రామ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన దీని గురించి మాట్లాడారు.’గతంలో ఇండియన్ సినిమా అంటే విదేశాల వారికి హిందీ చిత్రాలే తెలుసు. ఇతర భాషల్లోనూ ఉంటాయనే సంగతి తెలియదు.
ఇప్పుడు మన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నారు.ఓటీటీలతో సినిమాల పరంగా భాష పరిధులు తొలగాయి.భారీ సినిమాలనే కాదు.. కంటెంట్ ఉన్న ఏ చిత్రాన్ని అయినా చూసేందుకు ప్రపంచం ఎదురుచూస్తోంది.మహేశ్ – రాజమౌళి సినిమా అన్ని హద్దులను చెరిపేస్తుంది. భారీ స్థాయిలో ఇది విడుదల అవుతుంది. ’’ అని అన్నారు.ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.మహేశ్ 29వ ప్రాజెక్ట్‌గా ఇది సిద్ధం కానుంది.SSMB29గా ప్రచారంలో ఉంది.గరుడ అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు టాక్.