డాక్యుమెంటరీ విషయంలో సాయం చేసిన తన గత చిత్రాల దర్శక నిర్మాతలు,నటీనటులకు నయనతార థ్యాంక్యూ చెప్పారు.ఆయా చిత్రాలకు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని ఆమె తెలిపారు.వాటికి సంబంధించిన విషయాలను తన డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో చూపించాలని భావించానని చెప్పారు.నేను నటించిన ప్రతి చిత్రానికి నా జీవితంలో ప్రత్యేక స్థానం ఉంది.
ఆయా సినిమాలకు సంబంధించిన విశేషాలను డాక్యుమెంటరీ వేదికగా మీతో పంచుకోవాలనుకున్నా.అందుకోసం ఆయా సినిమాల దర్శక నిర్మాతలను సంప్రదించారు.వారు దానికి అంగీకరించడంతో ఆ విశేషాలను మీతో పంచుకోగలిగాను.అందుకు వారికి ధన్యవాదాలు’’ అని చెప్పారు.చిరంజీవి, రామ్‌చరణ్, షారుక్ ఖాన్, గౌరీఖాన్‌లతోపాటు తెలుగు, తమిళ చిత్రపరశ్రమలకు చెందిన వారికి ఆమె కృతజ్ఞతలు చెప్పారు.నయనతార వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితానికి సంబంధించి ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ అనే డాక్యుమెంటరీ సిద్ధమైన విషయం తెలిసిందే.నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఇది స్ట్రీమింగ్ అవుతోంది.