2025 ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార అన్ఆద్మీపార్టీ తమ అభ్యర్ధులకు సంబంధించిన మొదటి జాబితాను నేడు విడుదల చేసింది. 11 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
1.ఛతర్ పూర్-బ్రహ్మ్ సింగ్ తన్వార్
2.బాదర్ పూర్- రామ్ సింగ్ నేతాజీ
3.లక్ష్మీ నగర్ -బిబి త్యాగీ
4.శీలం పూర్-చౌదరి జుబేర్ అహ్మద్
5.సీమ పూరి -వీర్ సింగ్ దింగాన్
6.రోహ్తాస్ నగర్- సరితా సింగ్
7.గోండా -గౌరవ్ శర్మ
8.విశ్వాస్ నగర్ -దీపక్ సింగ్లా
9.కరవాల్ నగర్ – మనోజ్ త్యాగి
10.కిరారీ -అనిల్ నా
11.మటియాలా-సుమేష్ షోకీన్
మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొని.. జైలుకు వెళ్లి వచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజా తీర్పు కోసం కొన్ని నెలల క్రితం రాజీనామా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, రానున్న ఎన్నికల కోసం పార్టీ ముందుకు నడిపిస్తున్నారు. అదితీ ప్రస్తుతం ఢిల్లీ సీఎంగా ఉన్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన ఆప్
By admin1 Min Read
Previous Articleఅక్టోబర్ నెలలో మోస్ట్ పాపులర్ టాప్ 10 నటీనటులు
Next Article భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన సూచీలు