ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా లండన్ నగరం. మొదటి ర్యాంక్ లో నిలిచింది. గత పదేళ్లుగా ఈ జాబితాలో లండన్ నగరమే ప్రపంచ ఉత్తమ నగరంగా ఉంటోంది. తర్వాతి స్థానాల్లో న్యూయార్క్, పారిస్, టోక్యో, సింగపూర్, రోమ్, మాడ్రిడ్, బార్సిలోనా, బెర్లిన్, సిడ్నీ, తదితర నగరాలు టాప్-10లో నిలిచాయి.
రియల్ ఎస్టేట్, టూరిజం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో అంతర్జాతీయ సలహదారుగా ఉన్న ఒక సంస్థ ఈ ప్రపంచ ఉత్తమ నగరాల జాబితాను విడుదల చేసింది. 10 లక్షలకు మించి జనాభా ఉన్న నగరాలను ఈ జాబితా కోసం పరిశీలించి సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, భారీ వ్యాపార మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు లండన్ నగరానికి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకొచ్చినట్లు రిసోనెన్స్ పేర్కొంది.
ఈ సర్వే కోసం 30 దేశాలకు చెందిన 22 వేల మందికి పైగా ప్రజల నుండి అభిప్రాయాలు సేకరించారు. అనేక అంశాలను ప్రామాణికంగా తీసుకుని ఈసర్వే నిర్వహించారు.
Previous Articleభారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులు మృతి
Next Article నాగచైతన్య – శోభిత పెళ్లిపై నాగార్జున కామెంట్