ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది.గాజాలో యుద్ధ నేరాలపై అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది.నెతన్యాహు, ఇజ్రాయెల్ మాజీ రక్షణశాఖ మంత్రి యోఆవ్ గల్లాంట్‌పైనా ఇవి జారీ అయ్యాయి.గాజాలో యుద్ధ నేరాలు,మానవత్వానికి వ్యతిరేకంగా చర్యల కొనసాగింపు ఆరోపణలపై…ఈ ఇద్దరిపై ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసింది.
అయితే ఐక్యరాజ్యసమితి,ఇతర దేశాలు ఎప్పటి నుంచో యుద్ధాన్ని ఆపమని కోరుతున్నాయి.అయినా కూడా ఇజ్రాయెల్ అందరి మాటను పెడచెవిన పెడుతోంది.హమాస్,హెజ్బెల్లాలు అంతమొందించే వరకూ యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయిల్ అంటుంది.