ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు నాని.అమెజాన్ ప్రైమ్ వేదికగా రానా హోస్ట్ చేస్తోన్న ది రానా దగ్గుబాటి షోలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. Lతన సినీ కెరీర్‌తోపాటు ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. Lఇందులో భాగంగా పవన్ కల్యాణ్‌పై తన ఇష్టాన్ని తెలియజేశారు.‘సినీ పరిశ్రమలో పవన్ కల్యాణ్ స్టార్‌గా ఎలా ఎదిగారో తెలిసిందే. అయితే రాజకీయాల్లోనూ ఆయన అదే స్థాయిలో ఎదిగారు. అక్కడ కూడా పవర్‌స్టార్ అని నిరూపించుకున్నారు. ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారని చెప్పారు.
ఈ కామెంట్స్‌పై రానా మాట్లాడాడు.పవన్ చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చారన్నారు.ఆయన నిజంగానే సూపర్ స్టార్ అని చెప్పారు.ఇటీవల రాజకీయాలు కూడా సినిమాల్లాగే ఉన్నాయని అభిప్రాయపడ్డారు.గోవాలో జరుగుతోన్న ఇఫ్ఫి వేదికగా ఈ ఎపిసోడ్‌ను ప్రదర్శించారు.దీనికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.ఈ కార్యక్రమం ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.