తాజాగా ప్రకటించిన ఐసీసీ ఆల్ రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్న భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య అరుదైన ఘనతను అందుకున్నాడు. టీ20 క్రికెట్లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత ఆటగాడుగా చరిత్ర సృష్టించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరపున ఆడుతున్న పాండ్య తాజాగా గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బరోడా ఐదు వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఐదో స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్య (74నాటౌట్; 35 బంతుల్లో 6×4, 5×6) మెరుపు ఇన్నింగ్స్ తో గెలుపుని అందించాడు. శివాలిక్ శర్మ (64; 43 బంతుల్లో 7×4, 2×6) కూడా రాణించాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ ఒక వికెట్ కూడా పడగొట్టాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు