భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ పోరుకు సన్నద్ధమయ్యాడు. తన అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటూ అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగిన ఈ 28 సంవత్సరాల యువ కెరటంపై చెస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.సింగపూర్ వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా) తో అతడు ప్రపంచ టైటిల్ కోసం తలపడతాడు. 14 గేమ్ ల పోరులో భాగంగా నేడే మొదటి గేమ్. ప్రపంచ చెస్ టైటిల్ కోసం ఇద్దరు ఆసియా ఆటగాళ్లు తలపడడం 138 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ ప్రపంచ టైటిల్ మ్యాచ్లో 14 రౌండ్లు ఉంటాయి. సుదీర్ఘంగా సాగే ప్రపంచ సమరంలో గుకేశ్ ఒత్తిడిని ఎలా తట్టుకుంటాడన్నదే ఆసక్తికరం.
Previous Articleసన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇషాన్ కిషన్ , షమీ లు..!
Next Article గాయని మంగ్లీకి సంగీత నాటక అకాడమీ నుండి పురస్కారం