2025 జనవరి 11-12 తేదీల్లో ఢిల్లీలోని భారత్ మండపంలో యువ ఆలోచనల ‘మహాకుంభ్’ని నిర్వహించనున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. దీనిని వికసిత భారత్ యువ నేతల సమ్మేళనంగా పిలుస్తామని వెల్లడించారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని నిస్వార్థ యువతని రాజకీయాల్లోకి తీసుకు వచ్చి దేశ భవిష్యత్తును వారి చేతుల్లో పెట్టే లక్ష్యంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాల నుండి ఎంపిక చేసిన సుమారు రెండు వేల మంది యువతీయువకులు దీనికి హాజరవుతారని, కోట్ల మంది యువత పరోక్షంగా పాల్గొంటారని చెప్పారు. తాజాగా జరిగిన’మన్ కీ బాత్’ ద్వారా ఆయన ప్రజలనుద్దేశించి రేడియోలో ప్రసంగించారు. ఎర్రకోట బురుజులపై తాను పిలుపునిచ్చిన రీతిలో లక్షమంది యువతను రాజకీయాల్లోకి రప్పించేందుకు అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా ఈయువనేతల సదస్సు ఒకటని వివరించారు. దేశ విదేశాల నుంచి పలువురు ప్రముఖులు దీనిలో పాల్గొంటారని, తాను కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 12న స్వామీ వివేకానంద 162వ జయంతిని ప్రత్యేకంగా నిర్వహించనున్నామని ఈసందర్భంగా వివరించారు.
వచ్చే ఏడాది జనవరిలో వికసిత భారత్ యువ నేతల సమ్మేళనం: ప్రధాని మోడీ
By admin1 Min Read