డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ మరోసారి టైటిల్ నిలుపుకుంది. ఫైనల్లో 2-0తో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. ప్రపంచ నంబర్ వన్ యానెక్ సినర్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలి సింగిల్స్ లో బెరిటిని 6-4, 6-2తో బొటిక్ వాండెపై గెలిచి ఇటలీకి ఆధిక్యం అందించాడు. రెండో సింగిల్స్ సినర్ 7-6 (7-2), 6-2తో గ్రిక్స్ఫూర్ ను ఓడించి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. సింగిల్స్ లోనే ఫలితం తేలడంతో డబుల్స్ మ్యాచ్ నిర్వహించబడలేదు. చెక్ రిపబ్లిక్ (2012, 2013) తర్వాత వరుసగా డేవిస్ కప్ గెలిచి ఇటలీకి సత్తా చాటింది.
Previous Articleప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్: మొదటి గేమ్ గుకేశ్ ఓటమి
Next Article డబ్ల్యూ.టీ.సీ: మళ్లీ అగ్రస్థానంలో భారత్