తన మాజీ భర్త, నటుడు నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలామంది తనని సెకండ్ హ్యాండ్ అని కామెంట్ చేశారని నటి సమంత తెలిపారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె విడాకుల తర్వాత తనకు ఎదురైన విమర్శల గురించి మాట్లాడారు.కారణాలు ఏమైనా కావచ్చు ఒక మహిళ విడాకులు తీసుకుంటే అందరూ ఆమెను ఇబ్బందికరంగా చూస్తారు. ఇష్టం వచ్చిన మాటలు అంటారు.సెకండ్ హ్యాండ్, యూజ్డ్, జీవితాన్ని నాశనం చేసుకుంది అన్నట్లు మాట్లాడతారు.విడాకులు ఎందుకు తీసుకున్నా? అని ఆమె కుంగుబాటుకు గురయ్యేలా చేస్తారు.నిజం చెప్పాలంటే ఇది ఆమెతోపాటు ఆమె కుటుంబాన్ని కూడా ఎంతో బాధకు గురి చేస్తుంది.
జీవితంలో నేను ఎంతో బాధలు ఎదుర్కొన్నా. ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నా.మానసికంగా నేను ఎంతో ఎదిగా.వర్క్ పరంగా అద్బుతంగా ముందుకు సాగుతున్నా.జీవితంలో కొత్త అధ్యయాన్ని ప్రారంభించేందుకు ఆనందంగా ఎదురుచూస్తున్నా అని సమంత తెలిపారు.సమంత నటించిన రీసెంట్ ప్రాజెక్ట్ సిటడెల్..హనీ బన్నీ. స్పై, యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కింది.రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించారు.ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులో ఉంది.