ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం ఉన్న మనదేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ప్రజల హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్యస్ఫూర్తిని కాపాడడంలో భారత రాజ్యాంగందే కీలక పాత్రని టీడీపీ నేత ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగం అమలులోకి వచ్చి 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభసందర్భంలో రాజ్యాంగ నిర్మాతలైన బిఆర్ అంబేద్కర్, న్యాయ కోవిదులు, రాజ్యాంగ నిపుణులు, స్వాతంత్ర సమరయోధుల సేవలను స్మరించుకోవడం మన కర్తవ్యమని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పుస్తకం రూపొందించి అందించబోతున్నట్లు లోకేష్ తెలిపారు. ప్రాథమిక హక్కులు, ఇతర అంశాల గురించి విద్యార్థి దశ నుండే సులభంగా అర్ధం అయ్యేలా చెయ్యడమే ఈ పుస్తకం లక్ష్యమని స్పష్టం చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం నుండి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ చిల్డ్రన్ పేరుతో ప్రత్యేకంగా ఒక పుస్తకం: మంత్రి లోకేష్
By admin1 Min Read