నటి నయతనతార,నటుడు ధనుష్ మధ్య ఇటీవల వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.కోలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారి తీసిన ఈ వివాదంలో నయన్‌కు నటి పార్వతి తిరువోత్తు సపోర్ట్ చేశారు.నయన్‌కు మద్దతు తెలపడానికి గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.ఎలాంటి ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా నయన్ ఈ స్థాయికి వచ్చారు.ఆమె లేడీ సూపర్‌స్టార్.నాకు తెలిసినంత వరకూ తను ఎప్పుడు అబద్ధాలు చెప్పరు.తనకు ఎదురైన ఇబ్బందుల గురించి తెలియజేస్తూ దాదాపు మూడు పేజీల బహిరంగ లేఖ రాశారు.తన సమస్యను తెలియజేయడంలో తప్పు లేదనిపించింది.అందుకే ఆమెకు సపోర్ట్ చేశా.దానిని చూసిన వెంటనే షేర్ చేయాలనిపించింది.ఇన్‌స్టా షేర్ చేశా.ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరి జీవితాల్లో వస్తుంటాయి..అలాంటప్పుడు మనకంటూ ధైర్యం చెప్పేవాళ్లు పక్కన లేకపోతే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు.అందుకే నేను ఆమెకు సపోర్ట్‌గా నిలిచానని పార్వతి తెలిపారు.దూత సిరీస్‌తో పార్వతి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు.
నయనతార – విఘ్నేశ్ శివన్ పెళ్లిపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సిద్ధం చేసింది.నయన్ కెరీర్, ఎత్తుపల్లాలు, విమర్శలు,వీరిద్దరి ప్రేమ, పెళ్లి విషయాలను అందులో చూపించారు.తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన నానుమ్ రౌడీ దానే సినిమా ఫుటేజ్, పాటలను ఇందులో వాడాలని ఈ జంట భావించింది.అందుకు చిత్ర నిర్మాత,నటుడు ధనుష్ వ్యతిరేకత వ్యక్తం చేశారు.పర్మిషన్ ఇవ్వనప్పటికీ దాదాపు మూడు సెకన్ల ఫుటేజ్‌ను ఈ జంట డాక్యుమెంటరీ ట్రైలర్‌లో ఉపయోగించడంతో ధనుష్ లీగల్ నోటీస్ పంపించారు.దాదాపు రూ.10 కోట్లు నష్టపరిహారంగా చెల్లించమని డిమాండ్ చేశారు.దీనిపై నయన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లేఖ రిలీజ్ చేశారు. ధనుష్ క్యారెక్టర్‌ను తప్పుబట్టారు.ఆయన పైకి మాత్రంపై ఇతరులను ప్రేమించండి,, ప్రేమను పంచండి అంటుంటారని.. లోపల మాత్రం పక్కవాళ్లపై ద్వేషంతో రగిలిపోతుంటారని అన్నారు.తన తోటివారు ఎవరైనా విజయం సాధిస్తే ఆయన తట్టుకోలేరని తెలిపారు.నయన్ పెట్టిన పోస్ట్‌పై పార్వతితోపాటు చాలామంది నటీమణులు లైక్ కొట్టారు. ఈ పోస్ట్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిన పార్వతి సెల్యూట్ ఎమోజీ షేర్ చేశరు.