ప్రభుత్వ, లేదా ప్రైవేటు రంగాల్లో ఏదైనా ఉద్యోగంలో చేరితే తప్పకుండా కొన్ని డాక్యుమెంట్లపై సంతకం చేయాల్సి ఉంటుంది.ఉద్యోగి పాటించాల్సిన నియమ నిబంధనలు ఇందులో ఉంటాయి.సంతకం అంటే పెన్ను లేదా సిరాతో చేస్తాం.కానీ రక్తంతో సంతకం చేయడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.. అవును మీరు వింటుంది నిజమే…జపాన్‌లోని బ్యాంకులో ఉద్యోగంలో చేరాలంటే తప్పకుండా మీ రక్తం చిందించాల్సిందే.
జపాన్‌లోని ఒక బ్యాంకు పాటిస్తున్న ఈ వింత నిబంధన సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 30 ఏళ్ల నుంచి అక్కడి వారు ఈ నిబంధన అవలంభిస్తున్నారు.ఎవరైనా కొత్త వ్యక్తి అక్కడ జాబ్‌లో చేరితే…అతడితో రక్తంతో సంతకం చేయించుకుంటారు.ఉద్యోగుల్లో నైతిక ప్రవర్తన, సామాజిక బాధ్యత పెంచడం కోసమే అలాంటి రూల్స్ పెట్టినట్లు బ్యాంక్ పేర్కొంది.అంతేకాకుండా.. బ్యాంకులో ఉద్యోగం చేసే ఉద్యోగులు డబ్బు దొంగిలించినా, లేదా దొంగతనానికి సహకరించినా ఆ మొత్తాన్ని చెల్లించి, lఆత్మహత్య చేసుకోవాలనేది అక్కడి మరో రూల్.ఈ వింత రూల్స్ చూసి తాను షాకయ్యానంటూ తాజాగా ఓ నెటిజన్ తన ఆన్‌లైన్ బ్యాంక్ వెబ్‌సైట్ ఫొటో,అందులోని రూల్స్ ఫొటో షేర్ చేశాడు.దీంతో ఈవిషయం వెలుగులోకి వచ్చింది.