మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేశారు.ఈరోజు రాజ్‌భవన్‌లోని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.రాష్ట్రంలోని 14వ అసెంబ్లీ పదవీకాలం ముగియడంతో ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.తదుపరి సీఎం ఎవరు ఎన్నిక కానున్నారనేది తెలియరాలేదు.ఈ విషయంపై స్పష్టత వచ్చే వరకూ ఆయనే ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.
ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మహాయుతి కూటమి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.288 స్థానాలకు గాను 234 స్థానాల్లో మహాయుతి కూటమి ఘన విజయం అందుకుంది.ప్రతిపక్ష పార్టీ 48 సీట్లకే పరిమితమైంది.దీంతో బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తుంది. ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఏక్‌నాథ్ షిండే ను మరోసారి సీఎంగా చేయాలని శివసేన పార్టీ కోరుకుంటుంది.