దాదాపు 14 ఏళ్ల నుంచి విదేశాల్లో జీవితం గడుపుతున్నారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ.తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన భారత్ నుంచి వెళ్లిపోవడానికి గల కారణాన్ని తెలియజేశారు.మనదేశంలో తనపై ఎలాంటి కేసులు లేవని అన్నారు.కాకపోతే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ ఎన్నోసార్లు బెదిరింపులు వచ్చాయని….వాటిని తట్టుకోలేకే తాను విదేశాలకు వెళ్లిపోయానని ఆయన అన్నారు.
‘వాస్తవానికి, దేశం విడిచి పెట్టేటంతటి సీరియస్ కేసులేవీ నాపైన అప్పట్లో లేవు. దావూద్ ఇబ్రహీం నుంచి చంపేస్తామంటూ నాకు బెదిరింపులు వచ్చాయి.మ్యాచ్ ఫిక్సింగ్‌ను అస్సలు సహించను. అయితే,క్రికెట్ మ్యాచ్‌లు ఫిక్స్ చేయాలనుకున్న దావూద్ ఇబ్రహీం నాపై ఒత్తిడి పెంచాడు.అయితే, అవినీతికి వ్యతిరేకంగా ఆట సమగ్రతను కాపాడటంపైనే నా దృష్టంతా ఉంది.దీనికి తోడు వ్యతిరేక ప్రచారం నాపై ఎక్కువగా జరిగింది.ఆ క్రమంలోనే నేను భారత్ నుంచి విదేశాలకు పారిపోయి వచ్చా’ అని లలిత్ పేర్కొన్నారు.