డబ్ల్యూబీఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ డిసెంబర్ 11న చైనాలోని హాంగ్ఝౌలో ప్రారంభం కానుంది. కాగా, ఈ టోర్నీకి పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ జోడి అర్హత సాధించింది. తాజాగా విడుదల చేసిన మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ఈ జోడీ ఎనిమిదో స్థానంలో నిలిచి ఈ అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సంవత్సరం సింగపూర్ ఓపెన్, మకావు ఓపెన్లలో సెమీ ఫైనల్ చేరిన భారత ద్వయం. తాజాగా చైనా మాస్టర్స్ టోర్నీలో ప్రిక్వార్టర్స్ లో ఓటమి చెందింది. డబ్ల్యూబీఎఫ్ ఫైనల్స్ లో పి.వి.సింధు మాత్రమే ఇప్పటి వరకు టైటిల్ గెలిచింది.2018 లో ఆమె విజేతగా నిలిచింది. ఇక మరోవైపు సయ్యద్ మోదీ అంతర్జాతీయ సూపర్ 300 టోర్నీకి భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి దూరమయ్యారు. తాజాగా ప్రారంభమైన ఈ టోర్నీ నుండి సాత్విక్- చిరాగ్ జోడీ తమ ప్రవేశాన్ని ఉపసంహరించుకుంది.
డబ్ల్యూబీఎఫ్ ప్రపంచ టూర్ ఫైనల్స్ కు అర్హత సాధించిన గాయత్రి-ట్రీసా జాలీ జోడి
By admin1 Min Read