2025లో ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగే మహా కుంభమేళాలో రోబోలను ఉపయోగించాలని అధికారులు యోచిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించేందుకు వీటిని ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన 200 మంది ఫైర్ కమాండోలనూ కూడా అందుబాటులో ఉంచనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు రోబోలను మహాకుంభమేళాలో సిద్ధంగా ఉంచనున్నారు. ఇవి ఒక్కొక్కటి 20 నుంచి 25 కిలోల బరువుంటాయి. మెట్లు ఎక్కడంతో పాటు మంటలను అదుపు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. 35 మీటర్ల ఎత్తు నుండి నీటిని స్ప్రే చేసే వాటర్ టవర్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు కూడా అందుబాటులో ఉంచనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు