జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. రాజధాని రాంచీలోని మొరహాబాద్ మైదానంలో గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు.
81 స్థానాలకు గాను జేఎంఎం 34 స్థానాలలో బీజేపీ 21, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సీపీఐ (ఎంఎల్) (ఎల్) 2, ఏజేఎస్సూపీ, లోక్ జన శక్తి పార్టీ, జేఎల్కేఎం, జేడీయూ పార్టీలు ఒక్కో స్థానాన్ని గెలుచుకున్నాయి.
ఇక హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజీవాల్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తదితరులు హాజరయ్యారు.
Previous Articleభారత క్రికెటర్లతో సందడి చేసిన ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని
Next Article అల్లరి నరేష్ “బచ్చల మల్లి” టీజర్ విడుదల