సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు క్వార్టర్ ఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్ లో టాప్ సీడ్ సింధు 21-10, 12-21, 21-15తో ఇరా శర్మపై విజయం సాధించింది.
మరోవైపు ఉన్నతి హుడా 21-18, 22-20తో థాయ్ ల్యాండ్ కు చెందిన పోర్న్ పికాపై, తస్నిమ్ మీర్ 21-15, 13-21, 21-7తో అనుపమ ఉపాధ్యాయాపై, శ్రియాంషి వలిశెట్టి 21-12, 21-15తో మాళవిక బాన్సోద్ పై గెలిచి క్వార్టర్స్ చేరారు. పురుషుల సింగిల్స్ లో స్టార్ షట్లర్ లక్ష్యసేన్ క్వార్టర్స్ చేరాడు. ప్రిక్వార్టర్స్ లక్ష్యసేన్ 21-14, 21-13తో ఇజ్రాయెల్ కు చెందిన డానిల్ దుబొవెంకో పై గెలుపొందాడు.
Previous Articleనేటి నుండి అండర్-19 ఆసియాకప్
Next Article అల్లు అర్జున్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్