రష్యా , ఉక్రెయిన్ మధ్య ఎంతోకాలం నుండి యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. యుద్ధం మొదలై ఇటీవలే 1000 రోజులు కూడా దాటింది. ఈ యుద్ధం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. వనరులు నాశనం అయ్యాయి. తాజాగా ఈ యుద్ధం పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్పందించారు. తాము యుద్ధాన్ని ఆపేస్తామని తెలిపారు. అయితే కొన్ని షరతులు ఉన్నాయన్నారు. తమని వెంటనే నాటోలో భాగం చేయాలన్నారు. వీలైనంత త్వరగా ఆ పని జరగాలన్నారు. కీవ్ ఆధీనంలో ఉన్న భూభాగానికి నాటో రక్షణ ఇస్తే.. మిగిలిన భూమిని రష్యా కు వదిలేస్తామని వెల్లడించారు.
Previous Articleరాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం
Next Article ఓటీటీలోకి ‘అమరన్’