రాజధానిలో సంస్థలకు భూకేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం తాజాగా జరిగింది. మంత్రులు నారాయణ, కొల్లు రవీంద్ర పలువురు అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈఎస్.ఐ, బ్రహ్మకుమారి ఎడ్యుకేషన్ సొసైటీ, ఎల్&టీ,బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, టీటీడీ,సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్స్ అండ్ డిజైన్,ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీతో పాటు పలు సంస్థలకు భూకేటాయింపులు చేశారు. ధరల అంశంలో ఒక పాలసీ తయారు చేస్తామని తెలిపారు. వచ్చే నెలాఖరులోగా భూకేటాయింపులు పూర్తయ్యి జనవరి నుండి రాజధానిలో పనులు మొదలవ్వాలని ఈసందర్భంగా మంత్రులు అధికారులను ఆదేశించారు.
Previous Articleజనంలోకి జగన్: జనవరి నుండి పర్యటనలు
Next Article ఆ షరతులకు సరేనంటే… యుద్ధం ఆపుతాం:జెలెన్ స్కీ