వయనాడ్ ప్రజల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇటీవల వయనాడ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా గెలుపుని పురస్కరించుకుని కొయ్ కోడ్ లో జరిగిన బహిరంగ సభలో తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎంతో చేయాలని ఉన్నా అధికారంలో లేకపోవడం వల్ల అనుకున్నంత సాధ్యం కాకపోవచ్చు అని వ్యాఖ్యానించారు. అయితే ప్రజా సమస్యలపై తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు. వయనాడ్ ప్రజలపై ప్రధాని మోడీ వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అదానీపైన విమర్శలు గుప్పించారు. ప్రజల తరపున పోరాడాలని తన సోదరి వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి, యూడీ.ఎఫ్ కూటమి నేతలకు చెప్పారు. డీ, మీడియా, సీబీఐ, ఐటీ మోడీ తన ఆధీనంలో ఉంచుకున్నారని తమ వద్ద అవేమీ లేవని అన్నారు. ఇక వయనాడ్ ఎంపీ అవడం పట్ల ప్రియాంక గాంధీ వాద్రా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.వయనాడ్ ప్రజల గళాన్ని పార్లమెంటు వేదికగా వినిపిస్తానని పేర్కొన్నారు.
వయనాడ్ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
By admin1 Min Read