2024 సంవత్సరానికి గాను విజికీ తెలిపిన న్యూస్ స్కోర్ ర్యాంకింగ్స్ లో ప్రముఖ దిగ్గజ సంస్థ రిలయన్స్ అగ్రస్థానంలో నిలిచింది. 100 పాయింట్ల న్యూస్ స్కోర్ కి గాను రిలయన్స్ కు 97.43 పాయింట్లు లభించాయి. గతేడాది 96.46 పాయింట్లు, 2022 లో 92.56 పాయింట్లు, 2021లో 84.9 పాయింట్లు పొందింది. ప్రతి సంవత్సరం పాయింట్లు పరంగా రిలయన్స్ పెరుగుతూ వచ్చింది. ఫైనాన్షియల్, బ్యాంకింగ్ సంస్థల కంటే ఎక్కువగా వార్తల్లో కనిపించిన కంపెనీగా రిలయన్స్ నిలిచినట్లు విజికీ పేర్కొంది. బిగ్ డేటా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, మీడియా ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీతో ఈ స్కోర్ ను లెక్కించినట్లు తెలిపింది. ఇక రిలయన్స్ తరువాత ఎస్.బీ.ఐ, హెచ్.డి.ఎఫ్.సి, ఐసీఐసీఐ వంటివి ఉన్నాయి.
విజికీ న్యూస్ స్కోర్ అనేది భారతదేశంలో ఒక బ్రాండ్ యొక్క మీడియా విజిబిలిటీని కొలిచే ప్రమాణం, ఇది పలు అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది. వీటిలో న్యూస్ వాల్యూమ్ అంటే బ్రాండ్ గురించి వచ్చిన వార్తల పరిమాణం, హెడ్లైన్ ప్రెజెన్స్, పబ్లికేషన్ రీచ్, మరియు రీడర్షిప్ వంటివి ఉన్నాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు