హిందువులు, మైనారిటీలపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్పందించింది. అక్కడ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. మహామ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆక్షేపించింది. ఇస్కాన్ కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టు అన్యాయమని తక్షణం ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే కట్టడి చేసే చర్యలు తీసుకోవాలని తెలిపింది. హిందువులు మిగిలిన మైనారిటీలు ఎదుర్కొంటున్న పరిస్థితులపై భారత్ మరియు అంతర్జాతీయ సమాజం సంఘీభావంగా నిలబడాలని పేర్కొంది.
ఇక బంగ్లాలోని హిందువుల భద్రత కోసం డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా ప్రార్ధనలు చేపట్టనున్నట్లు ఇస్కాన్ వెల్లడించింది.
బంగ్లాదేశ్ లో మైనారిటీలపై దాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. చటోగ్రామ్లో కొందరు ఆందోళనకారులు హిందూ వ్యతిరేక నినాదాలు చేస్తూ మూడు దేవాలయాలపై దాడికి పాల్పడ్డారు. ఈ తరహా ఘటనలపై స్పందించిన భారత్.. దేశంలోని అల్పసంఖ్యాకులను రక్షిస్తామని తాత్కాలిక ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేసింది. మైనారిటీలు సహా పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడే బాధ్యత అక్కడి ప్రభుత్వంపై ఉందని పేర్కొంది.
హిందువులు, మైనారిటీలపై బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్.ఎస్.ఎస్
By admin1 Min Read