ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని విభజన అంశాలకు సంబంధించి చర్చలు జరిపేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఉన్నతాధికారుల కమిటీ సమావేశమైంది. ఈ ఏడాది జులై లో ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ప్రజా భవన్ వేదికగా సమావేశమైన సంగతి తెలిసిందే. పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీకి కొనసాగింపుగా ఇప్పుడు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ఉభయ రాష్ట్రాల ఆస్తుల పంపకాలు, అపరిష్కృతంగా ఉన్న సమస్యలు తదితర విషయాలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల విభజన అంశాలపై చర్చించేందుకు ఉన్నతాధికారుల కమిటీ భేటీ
By admin1 Min Read