ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ 445 పాయింట్ల లాభంతో 80,248 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్టీ సైతం 142 పాయింట్ల లాభంతో 24,274 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 84.69గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో తాజాగా జీడీపీ వృద్ధి తగ్గుదల ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో నష్టాలతో ట్రేడింగ్ ఆరంభించిన సూచీలు మధ్యాహ్నం తరువాత నుండి పుంజుకుని లాభాల బాటలో పయనించాయి. రిలయన్స్, ఇన్ఫోసిస్, అల్ట్రా టెక్ సిమెంట్స్ , టైటాన్, జే.ఎస్.డబ్ల్యూ, టెక్ మహీంద్రా, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాలతో ట్రేడింగ్ ముగించాయి.
Previous Articleటాలీవుడ్ లోకి మోహన్ బాబు మనవరాళ్లు ఎంట్రీ…!
Next Article పార్లమెంటులో రాజ్యాంగంపై చర్చకు సిద్ధం..!