అండర్-19 ఆసియా కప్ లో భారత్ భారీ విజయం సాధించింది. జపాన్ తో జరిగిన మ్యాచ్ లో 211 పరుగుల తేడాతో గెలిచి బోణీ చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. కెప్టెన్ మహ్మద్ అమన్ (122 నాటౌట్, 118 బంతుల్లో 7×4) శతకంతో సత్తా చాటాడు. ఓపెనర్ ఆయుష్ మాత్రే 54(29;6×4, 4×6) విధ్వంసం సృష్టించాడు. కార్తీకేయ 57(50;5×4,1×6) మంచి ప్రదర్శన కనబరిచాడు. వైభవ్ సూర్య వంశీ 23(23;3×4,1×6), హార్థిక్ రాజ్ 25(12;1×4, 2×6) బ్యాట్ ఝళిపించడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. ఇక లక్ష్య ఛేదనలో జపాన్ 128/8 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ కెల్లీ (50) టాప్ స్కోరర్. ఛార్లెస్ హింజ్ 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో హార్థిక్ రాజ్, కార్తీకేయ, చేతన్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా...యుధజిత్ ఒక వికెట్ పడగొట్టారు. ఇక భారత్ డిసెంబర్ 4న తదుపరి మ్యాచ్ లో యూఏఈతో తలపడనుంది.
Previous Articleఆ నిబంధనల సదలింపునకు నో ఛాన్స్: సుప్రీం కోర్టు
Next Article అమితాబ్ షో నేను చూస్తా : రేఖ

