గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే అస్వస్థతకు గురయ్యారు.చికిత్స నిమిత్తం ఆయన్ని ఠానేలోని జుపిటర్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం వైద్యులు పరీక్షిస్తున్నారు.తాను ఆరోగ్యంగానే ఉన్నానని ఆయన ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడారు.మరోవైపు,కంగారు పడాల్సింది, రోటీన్ చెకప్ భాగంగానే ఆయన ఇక్కడికి వచ్చారని స్థానిక వర్గాలు తెలిపాయి.ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 288 స్థానాలకు గాను 234 స్థానాలతో మహాయుతి కూటమి ఘన విజయం అందుకుంది.
అందులో బీజేపీ 132స్థానాలు గెలుపొందగా,శివసేన 57, ఎన్సీపీ 41 సీట్లల్లో విజయం సాధించాయి. కొత్తప్రభుత్వం ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా మిత్రపక్షాల్లో ఏ ఒక్కరు మద్దతిచ్చినా బీజేపీ గద్దెనెక్కవచ్చు.అయితే బీజేపీ నుంచే ముఖ్యమంత్రి అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానం భావిస్తుంది.ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా చేసిన తమ అభ్యర్థి ఏక్‌నాథ్ శిండేనే మరోసారి సీఎం చేయాలని శివసేన పట్టుబడుతుంది.దీనితో మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టనున్నారనే దానిపై గత కొన్నిరోజులుగా సందిగ్ధత నెలకొంది.