దేశంలోని సరికొత్త నేర నియంత్రణ చట్టాలు సమగ్రమైనవని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. రాజ్యాంగం స్వప్నాలను సాకారం చేసే విధంగా దేశంలో తీసుకువచ్చిన కొత్త నేర నియంత్రణ చట్టాలు కీలక ముందడుగని పేర్కొన్నారు. దేశం స్వాతంత్ర్యం సాధించిన 70 ఏళ్లలో దేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలు నిశితంగా అధ్యయనం చేసి వీటిని రూపొందించారని తెలిపారు. వీటి తయారీ ప్రక్రియ కూడా విస్తృతంగా ఉందని తెలిపారు. ఎందరో నిపుణుల శ్రమ కూడా దాగి ఉందన్నారు. 2020 జనవరిలో హోం మంత్రిత్వ శాఖ జనవరిలో అభిప్రాయాలు కోరిందని సుప్రీంకోర్టు, హైకోర్టులు, లా విశ్వవిద్యాలయాలు, పౌర సంస్థలు, మేధావులు సంవత్సరాల పాటు చర్చించి తమ అభిప్రాయాలు మేలవించారని పేర్కొన్నారు. గతంలో ఎదురైన సవాళ్లను విశ్లేషించారని భవిష్యత్తుకు సరిపడా ప్రమాణాలు పొందుపరిచారని వివరించారు. ఇది మన న్యాయ చరిత్రలో మైలురాయిగా అభివర్ణించారు. స్వాతంత్ర్యం అనంతరం కూడా ఆపాత బ్రిటిష్ చట్టాల చుట్టూ పాలకులు తిరిగారని అయితే ఇప్పుడు దేశం వలస పాలకుల మనస్తత్వం నుండి బయటపడిందని పేర్కొన్నారు.సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు ఈసందర్భంగా ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు. చండీగఢ్ లో ఒక కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఇక్కడికి వస్తే సొంత మనుషుల మధ్య ఉన్నట్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ నగరం శక్తి స్వరూపిణి అయిన చండీ అమ్మవారి పేరుతో ముడిపడి ఉంది. ఆమె సత్యం, న్యాయాన్ని నిలబెట్టారు. భారత న్యాయ సంహిత చట్టాలు ఇదే భావనతో ఉన్నాయని అన్నారు. వీటి పరిధిలోకి దేశం రావడం గొప్ప అధ్యాయమని పేర్కొన్నారు.
Previous Articleనేడూ లాభాల్లోనే ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
Next Article ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్:మరో గేమ్ డ్రా