చలికాలంలో మనకు ఎక్కువగా దొరికేది చిలకడ దుంప.దీనిని తినేందుకు కొంతమంది చాలా ఆసక్తి కనబరుస్తారు.మరికొంత మంది మాత్రం అంత ఇష్టం చూపించరు.మరి చిలకడ దుంపల వల్ల వచ్చే లాభాలు ఏమిటంటే..ఈ దుంపల్లో బీటా కెరాటిన్ ఎక్కువగా ఉంటుంది.అది కళ్ళ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.కళ్ళ సమస్యలు దూరం చేస్తుంది.ఇందులో విటమిన్ సి, ఇ ఉంటుంది.ఈ విటమిన్స్ వల్ల చర్మం చాలా అందంగా మెరిసిపోతుంది.ముడతలు తగ్గుతాయి.
యంగ్ లుక్ లో మెరిసిపోతారు.కాల్షియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది.దానివల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఎముకలు బలంగా మారతాయి.ఫైబర్ ఎక్కువ ఉంటుంది.దానివల్ల త్వరగా ఆకలి తీరిన భావన కలుగుతుంది.బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.