మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఎన్నికయ్యారు. ఈమేరకు నేడు జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో ఆయనను నేతలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 5న ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆజాద్ మైదానం వేదికగా జరుగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ సహా ఎన్డీయే కూటమి నేతలు హాజరుకానున్నారు. మహారాష్ట్ర శాసనసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాయుతి కూటమిగా ఏర్పడిన బీజేపీ-శిండే శివసేన-అజిత్ పవార్ ఎన్సీపీలు భారీ విజయం సాధించాయి. ఈ మూడు పార్టీలు కలిసి 230 స్థానాలు గెలుచుకున్నాయి. బీజేపీ 132 సీట్లతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. శిండే-శివసేన 57, అజిత్ పవార్ ఎన్సీపీ 41 స్థానాలలో గెలుపొందాయి. ఇంత భారీ మెజారిటీతో గెలిచి కూడా ప్రభుత్వ ఏర్పాటులో మాత్రం ఇప్పటి వరకు కొంత ప్రతిష్టంభన నెలకొంది. అయితే తాజాగా ఆ ప్రతిష్టంభనకు తెరపడింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్
By admin1 Min Read