బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్.ఆమె ప్రభుత్వం దేశాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిందని అన్నారు.ప్రజలు ఇబ్బందులు పడటానికి ఆమె కారణం అన్నారు.ప్రస్తుతానికి తమ దేశం లో ఎన్నికలు నిర్వహించమని అక్కడి మీడియా తో తెలిపారు. న్యాయ,రాజ్యాంగ పరమైన సవరణలు ఎన్నో చేయాలని అన్నారు.అవి పూర్తి అయ్యాకే ఎలక్షన్స్ ఉంటాయని అన్నారు.మరోవైపు,ఇటీవల యూనాస్ ను తప్పుబడుతూ హసీనా ఒక కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.బంగ్లాదేశ్ లో జరుగుతున్న దాడుల వెనుక మాస్టర్ మైండ్ ఆయనదే అన్నారు.తనపై కావాలనే తప్పుడు కేసులు పెట్టారని వ్యాఖ్యానించారు.
Previous Article‘అమరన్’ ఓటీటీ రిలీజ్ నిలిపివేయండి..: కోర్టులో విద్యార్థి దావా
Next Article ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత