ఉద్యోగుల రిటైర్మెంట్ వయసుపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వయసును మార్చే దాని గురించి ఎటువంటి అంశం పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటులో తెలిపారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. అందులో దీని గురించి పేర్కొన్నారు. ఇక ఖాళీగా ఉన్న పోస్టులను సమయానుకూలంగా భర్తీ చేయమని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఎప్పటికప్పుడు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. మిషన్ మోడ్ లో ఖాళీలు భర్తీ చేస్తున్నట్లు వివరించారు. యువతకు ఉపాధి కల్పించే అవకాశాలు, కార్యక్రమాలు రూపొందించడంలో ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.
Previous Articleమాజీ ప్రధాని షేక్ హసీనా పై ప్రభుత్వ సారథి కీలక వ్యాఖ్యలు
Next Article పుష్ప 2 మిడ్ నైట్ షో రద్దు