రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించిన మాజీ సీఎం జగన్ కు మరోసారి పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.This is వాస్తవం…! మీ పాలనలో ఉత్తరాంధ్ర రైతులను పట్టించుకొన్నారా? మా కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఈ క్షణానికి 1,61,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మరి మీరేం చేశారు? ఓసారి లెక్కలు చూసుకోండి అంటూ గణాంకాలు కూడా తన పోస్ట్ కు జత చేశారు. ఇక మరోవైపు విశాఖపట్నంలో నిర్వహించిన పౌర సరఫరాల శాఖ రీజినల్ కాన్ఫరెన్స్ లో నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించి అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
This is వాస్తవం…! @ysjagan
మీ పాలనలో ఉత్తరాంధ్ర రైతులను పట్టించుకొన్నారా?
మా కూటమి ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్లో ఈ క్షణానికి 1,61,489 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
మరి మీరేం చేశారు? ఓసారి లెక్కలు చూసుకోండి.@ncbn @PawanKalyan pic.twitter.com/yu8M43saFZ— Manohar Nadendla (@mnadendla) December 5, 2024