మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ ప్రమాణ స్వీకారం చేశారు.శివసేన అధినేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు.వారితో ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయించారు.ఫడ్నవీస్ 3వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
కాగా ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్రమోదీ,కేంద్రమంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్ నాథ్ సింగ్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్,ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు,మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్,ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ సహా ఎన్డీయే పాలిత రాష్ట్రాల నుండి 19 మంది ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
महाराष्ट्राच्या वेगवान विकासाचा पुनश्च शुभारंभ 🙏#DevaBhauReturns #maharashtra #BJP #narendramodi pic.twitter.com/dP0uw1OuTr
— भाजपा महाराष्ट्र (@BJP4Maharashtra) December 5, 2024