పి.ఎస్.ఎల్.వి.-సి59 వాహక నౌకను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన శ్రీహరికోట షార్ శాస్త్రవేత్తలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ వాహక నౌక ద్వారా యూరప్ అంతరిక్ష సంస్థకు చెందిన ప్రోటా-3లోని రెండు ఉప గ్రహాలను తీసుకువెళ్లడం, వాటి ద్వారా సూర్యుడి బాహ్య వాతావరణంపై పరిశోధనలకు వీలు కలుగుతుంది. ఈ ప్రయోగం ద్వారా సౌర అన్వేషణలో మరో అడుగు వేస్తున్నామని తెలిపారు. ప్రధాన నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని కాబట్టే అంతర్జాతీయ స్థాయిలో మన శాస్త్రవేత్తలు విజయాలు అందుకుంటున్నారని ఈ స్పూర్తితో మరిన్ని విజయవంతమైన పరిశోధనలు చేస్తారని ఆకాంక్షిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
శ్రీహరికోట షార్ శాస్త్రవేత్తలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు
By admin1 Min Read