ఢిల్లీలోని భారత మండపంలో ప్రధాని నరేంద్ర మోడీ ‘అష్టలక్ష్మీ మహోత్సవం’ ను ప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ హస్తకళలు, మరియు జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం మరియు పర్యాటక రంగంలో ఆర్థిక అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ‘అష్టలక్ష్మీ మహోత్సవం’ నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 6 నుండి 8 వరకు జరుగుతోంది. కాగా, ఈశాన్య రాష్ట్రాల కోసం కేంద్రం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను వాజ్ పేయి ప్రభుత్వమే మొట్టమొదటిగా ప్రారంభించినట్లు తెలిపారు. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతి శాఖ నుండి 20 శాతం నిధులను కూడా కేటాయించినట్లు తెలిపారు. దశాబ్ధ కాలంలో 700 సార్లు ఈశాన్య రాష్ట్రాలలో పర్యటించారని పేర్కొన్నారు. అక్కడి ఆర్థిక వ్యవస్థ, ప్రజల మనోభావాలు, ఎకోలజీతో అనుసంధానం చేసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దేశ ప్రగతిలో భాగమయ్యే విధంగా తమ నేతృత్వంలోని ప్రభుత్వం దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్, ముంబై, చెన్నై, బెంగళూరు లాగా ఈశాన్య రాష్ట్రాలలోని నగరాలు అభివృద్ధి చెందుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అద్భుతమైన ప్రగతిని ఇక్కడ చూడవచ్చని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాలు ప్రగతి పథంలో పయనించే విధంగా కృషి: ప్రధాని మోడీ
By admin1 Min Read

