సికింద్రాబాద్-విల్లుపురం-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటన చేసింది.కాగా రైలు నెం.07601 సికింద్రాబాద్-విల్లుపురం ప్రత్యేక రైలు ఈ నెల 12న సికింద్రాబాద్ నుంచి రాత్రి 7.40 గంటలకు బయల్దేరి తర్వాత రోజు మధ్యాహ్నం 1.05 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది.
తిరిగి ఇదే రైలు నెం.07602 విల్లుపురం-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 13న విల్లుపురంలో సాయంత్రం 4.05 గంటలకు బయల్దేరి తర్వాత రోజు ఉదయం 9.40 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.ఈ రైలు తిరువణ్ణామలై, కాట్పాడి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు మీదుగా ప్రయాణిచనుంది.ఈ రైళ్ల రిజర్వేషన్ నిన్నటి నుండి ప్రారంభమైంది అని అధికారులు తెలిపారు.