ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం ఈనెల 15న జరగనుంది. ఇక ఈ వేలంలో 120 మంది ప్లేయర్లు అందుబాటులో ఉండనున్నారు. వీరిలో 91 మంది స్వదేశీ ప్లేయర్లు కాగా మిగిలిన 29 మంది విదేశీ ప్లేయర్లు. మొత్తం 19 మందినే ఈ పూల్ నుండి ఫ్రాంచైజీలు ఎంచుకోనున్నాయి. వేలంలో ఉన్న వారిలో 82 మంది అరంగ్రేటం చేయని భారత ప్లేయర్లు. ఇక ఈ వేలంకు సంబంధించి అన్ని టీమ్ ల కంటే గుజరాత్ జెయింట్స్ దగ్గర ఎక్కువ డబ్బు (రూ4.4 కోట్లు) ఉంది. ఆ టీమ్ ఇద్దరు విదేశీ ప్లేయర్లు సహా నలుగురిని ఎంపిక చేసుకోవచ్చు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ లో నాలుగు ఖాళీలు ఉండగా..యూపీ వారియర్స్ ముగ్గురిని తీసుకోవాల్సి ఉంది.
Previous Articleఎనర్జీ ఎఫిషియన్సీపై ఉర్జావీర్ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్
Next Article షమీ వస్తున్నాడు: మరింత పటిష్టం కానున్న భారత పేస్ దళం