ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ,సైందవి దంపతులు కొంతకాలం క్రితం విరిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది.తాజాగా వీరిద్దరూ ఒకే స్టేజ్ పై సంగీత ప్రదర్శన ఇచ్చారు.తమ కాంబోలో వచ్చిన పలు హిట్ పాటలను స్టేజ్ పై పాడి ప్రేక్షకులను అలరించారు.దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.వీటిని చూసిన పలువురు నెటిజన్స్ ఇదొక ఎమోషనల్ మోమెంట్ అని కామెంట్ చేస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ కు మేనల్లుడిగా జీవీ ప్రకాష్ కు మంచి గుర్తింపు ఉంది.2013లో ఆయన సైంధవి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెబుతూ ఈ ఏడాది మే నెలలో విడిపోతున్నామని ప్రకటించారు.
Previous Articleన్యూఢిల్లీలో స్కూల్స్ కు బాంబు బెదిరింపులు…!
Next Article యానిమల్ – 2 షూట్ @ 2027